ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బెడ్ రెస్ట్


దిశ దశ, కరీంనగర్:

రాష్ట్ర శాసన మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. సోమవారం కరీంనగర్, హుజురాబాద్ రహదారిపై ఆయన కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ ను తప్పించబోయి చెట్టుకు ఢీ కొనడంతో ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారు చెట్టుకు ఢీ కొనడం, అందులో బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటన తరువాత వెంటనే తేరుకున్న కౌశిక్ రెడ్డి మరో వాహనంలో హుజురాబాద్ కు చేరుకుని 2కె రన్ తో పాటు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ వెల్లి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. సోమవారం నాటి ప్రమాద సమయంలో ఆరోగ్యంగానే కనిపించినప్పటికీ మంగళవారం ఆయనను విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఇంటర్నల్ గా ఏర్పడిన చిన్న చిన్న గాయాలు ఆయన్ని బాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన రెస్ట్ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచించి ఉంటారని సమాచారం. బెడ్ రెస్ట్ లో ఉన్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పరమార్శించారు.

cm kcrcrimecrime newsCRIME TODAYLatest NewsMLC Padi Kaushik ReddyPADI KOUSHIK REDDYtelangana news