రామునిపై రమేషుడి కామెంట్స్…

రాజన్న జిల్లాలో హాట్ టాపిక్

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. వేములవాడ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీ నరసింహరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ… మిడ్ మానేరు ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురైన గ్రామాలు సిరిసిల్ల పరిధిలో ఉన్నట్టయితే వారికి న్యాయం జరిగేదేమోనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఒకానోక దశలో మంత్రి కేటీ రామారావుతో కూడా ఈ కామెంట్ చేశానన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని తాను ఎక్కని గడప లేదు… మాట్లాడని సందర్భం లేదు, ముంపు గ్రామాల కోసం అయితే తాను అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్ష నేత అనుకుంటారన్న భయం లేకుండా మాట్లాడనన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాళ్లు పట్టుకోవడం తప్ప అన్ని చేశానని, చెన్నమనేని రాజేశ్వర్ రావు కుమారున్ని కాబట్టి ఆత్మ గౌరవం ఉంది కాబట్టి కాళ్లు పట్టుకోలేదని పట్టుకోను కూడా అవసరమైతే పోరాటం కూడా చేస్తానని రమేష్ బాబు వ్యాఖ్యానించారు. ముంపు గ్రామాల విషాద గాథల గురించి అందరూ కూడా పాఠాలు నేర్చుకోవల్సి ఉందని చెన్నమనేని రమేష్ బాబు అభిప్రాయపడ్డారు.

Kt ramaraoLatest NewsMLA Ramesh Babu's comments on Mid Maneru rehabilitationrajanna sircillatelangana news