జర్నలిస్టులకు బాసట: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్

దిశ దశ, గోదావరిఖని: 

అపదలో ఉన్న జర్నలిస్టులను ఆదుకునేందుకు అండగా నిలుస్తాని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. నిత్యం వార్తా సేకరణలో తలమునకలయ్యే జర్నలిస్టులు హఠన్మరణం చెందుతున్న తీరు ఆందోళన కల్గిస్తోందన్నారు. రెండురోజుల క్రితం గుండెపోటుతో మరనించిన రామగుండం BIG TV రిపోర్టర్ చిరంజీవి కుటుంబాన్ని పరామర్శించారు. చిరంజీవి కుటుంబానిని తనవంతు సహకారం అందిస్తానన్నారు. చిరంజీవి పిల్లలను బాగా చదివించాలని ఆకాంక్షించిన ఆయన రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. మరణించిన వారి పేరిట విందులు నిర్వహించి ఖర్చులు పెట్టడం కంటే బాధలో ఉన్న ఆ కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా నిలిచినట్టయితే బాధిత కుటుంబ సభ్యులకు కూడా కొంత వెసులుబాటు దొరుకుతుందన్న భావనతో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సాయం అందించారు. చనిపోయిన వ్యక్తి కోసం ఏధో రూపంలో డబ్బు వృధా చేయడం కంటే పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం భవిష్యత్తులో నిలదొక్కుకోవాలంటే ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే  చేసిన ఆలోచనా విధానం ఆదర్శంగా ఉందని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు.

బీజాపూర్ లో… 

ఇకపోతే ఈ నెల 1న దారుణ హత్యకు గురైన జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ విషయంలో కూడా చత్తీస్ గడ్ ప్రభుత్వం తన ఉదారతను చాటుకుంది. ఆయన కుటుంబానికి రూ. 10 లక్షల సాయం ప్రకటించడంతో పాటు ముఖేష్ చంద్రాకర్ పేరిట జర్నలిస్ట్ భవనం కూడా నిర్మిస్తామని చత్తీస్ గడ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు.

chhattisgarhjournalistmakkan singh takurramagundam mlatelangana news