జైలుకెళ్లిన ఎమ్మెల్యే గంగుల…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావులు కొద్ది సేపటి క్రితం జిల్లా జైలుకు వెళ్లారు. భూ కబ్జా కేసులో రెండు రో్జుల క్రితం అరెస్ట్ అయిన వారిని కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులు బుధవారం బీఆర్ఎస్ కార్పోరేటర్ తోట రాములు, చీటి రామారావులను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరికి ఈ నెల 31 వరకు కరీంనగర్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. శుక్రవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావులు వారిని కలిసేందుకు జైలుకు ప్రత్యేకంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

gangula kamalakarKarimagar District Jailkarimnagar newstelangana news
Comments (0)
Add Comment