BHEL ప్రతినిధి ఫిర్యాదు…
కేసు నమోదు చేసిన CBI
దిశ దశ, పెద్దపల్లి:
రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టు పనుల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయన్న అభియోగంపై సీబీఐ అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసింది. BHEL ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ జారీ చేసిన హైదరాబాద్ CBI అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 2017 – 2022 కాలంలో 800 మెగావాట్ల రెండు యూనిట్లకు సంబంధించిన కాంట్రాక్టుకు సంబంధించిన పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని BHEL విజిలెన్స్ విభాగానికి చెందిన అడిషనల్ జీఎం హరిష్ కుమార్ గుప్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. RC0352025A0013 FIRలో సెక్షన్ 120B r/w 420, 468, 471, 477a, pc act -1988 13(2) r/w13(1)(d), pc act 1988 13(2) r/w13 (1) (a) IPCలలో కేసు నమోదు చేశారు. అధికార దుర్వినియోగం, నేర పూరిత కుట్ర, ఫోర్జరీ, ఛీటింగ్ కు పాల్పడ్డారని ఈ కేసు నమోదు చేశారు. రామగుండం సైట్ లో పనిచేసిన BHEL కంపెనీ AGM సునిల్ కుమార్ కొడ్పే, మేనేజర్ సజ్జన్ కుమార్ సోనీ, డిప్యూటీ మేనేజర్ అశుతోష్ ప్రేమ్ చంద్ జుమాంకే, జనరల్ మేనేజర్ రాజీవ్ చక్రవర్తి, ఏజీఎం బి సి తుడు, M/s Power Inframech Private Limited contractor of M/s B&R India Company Ltd, H.No.236, Tuiladungri, Golmuri, Jamshedpur, East Singhbhum, Jharkhand, Unknown public servants of NTPC, BHEL and M/s B&R(Bridge and Roof Company India Ltd.)(7), Unknown Public Servant(s) & Private Person(s)లు ఈ అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. రూ. 35.03 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయాన్న అభియోగంపై ఈ కేసు నమోదు చేశారు. BHEL సంస్థను మోసం చేయాలన్న ఉద్దేశ్యంతో సంస్థకు చెందిన ఐధుగురు అధికారులు, కోల్ కత్తాకు చెందిన మెస్సర్స్ బ్రిడ్జ్ అండ్ రూప్ కంపెనీ దాని కాంట్రాక్టర్ మెస్సర్స్ పవర్ ఇన్ ఫ్రామెచ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు కొంతమంది ఉద్యోగుల భాగస్వామ్యం ఇందులో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి కారణంగా సదరు కాంట్రాక్టు పనికి అదనంగా రూ. 35.03 కోట్ల మేర చెల్లించాల్సి వచ్చిందని, వీరి ప్రయోజనాల కారణంగా BHEL సంస్థ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందని గుర్తించారు.