మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ సూసైడ్

దిశ దశ, హైదరాబాద్:

మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంగరక్షకుడు అత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. హైదరాబాద్ నగరంలోని అమీర్ పేట శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్ లో చోటు చేసుకుంది. తన కూతురిని పిలిపించుకుని తుపాకితో కాల్పుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఫాజిల్ కొంతకాలంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గన్ మెన్ గా డ్యూటీ చేస్తున్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన ఆత్మహత్య చేసుకోగా ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అయితే ఫాజిల్ ఆత్మహత్యకు ఆర్థిక కారణలేనన్న ప్రచారం జరుగుతోంది. పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే ఫాజిల్ సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటన్నది అతని కుటుంబ సభ్యులు ప్రకటనను బట్టి పోలీసు అధికారులు కేసు దర్యాప్తు చేయనున్నారు.

crime newsLatest NewsMinister Sabitha Indra Reddy Gunman Suicidetelangana news