గొర్లు కాసిన… గొంగడి ఏసిన…

దిశ దశ, హైదరాబాద్:

వైవిద్యతను ప్రదర్శించడంలో ఆ మంత్రికి ఆ మంత్రే సాటి… ఆయనకు ఎవరూ ఉండరు పోటీ… మాటల్లో అయినా చేతల్లో అయినా అందరినీ కడుపుబ్బా నవ్వించడంలో ఆయన స్పెషాలిటీయే వేరు. హావా భావాలతో పాటు… వ్యవహరించే తీరు కూడా అందరు చర్చించుకునేలా ఉంటుంది ఆ మంత్రి తీరు. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుండడంతో మళ్లీ తెరపైకి వచ్చింది ఆ మంత్రి అంశం.

ఎవరా మంత్రి…?

రాష్ట్ర మంత్రి సి మల్లారెడ్డి గురించి తెలియని వారుండరేమో. విద్యా సంస్థల అధినేతగా కూడా ఉన్న ఆయన కాలేజీలో చదివే విద్యార్థులకు ఇచ్చే స్సీచ్ ఎప్పూడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడినా… బహిరంగ సభల్లో ప్రసగించినా మల్లారెడ్డికి మల్లారెడ్డే సాటి అన్నట్టుగా ఉంటుంది. గతంలో తానేం చేశానో చెప్పిన మంత్రి మల్లారెడ్డి పాలమ్మిన… బర్లు కాసిన అన్న డైలాగ్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుంది. తాజాగా ఆయన గొంగడి కప్పుకుని గొర్ల కాపారి వేషం వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మల్లన్న గొర్లు కాసిన… గొంగడి వేసిన అంటూ ఉపన్యాసాలు ఇస్తారేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

cm kcrcmrKCRLatest Newsminister mallareddytelangana news