సామూహిక గాయత్రి మంత్ర జపం

దిశ దశ, కరీంనగర్:

లోక కళ్యాణార్థం కరీంనగర్ లో సామూహిక గాయత్రి మంత్ర జప కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కట్టరాంపూర్ అభయ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ అనుభంద ఆధ్యాత్మిక సంస్థ, సంధ్యా వందన అభ్యాసన శిక్షణా సమితి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు చేపట్టిన ఈ కార్యక్రమం సంస్థ అధ్యక్షులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి నేతృత్వంలో శతకోటి గాయత్రి మహా మంత్ర జపం, అంతర్గత సామూహిక గాయత్రి మంత్ర జపం చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, ఉపేందర్, శర్మ, మధుసూధన్ శర్మ, రాంమోహన్, పురుషోత్తం, గోపీ కృష్ణ, మూగు నాగేశ్వర శర్మ, జితేందర్, చౌటి లక్ష్మణ శర్మ, పలువురు జపతులు, కరీంనగర్ నగర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలాంటి లోక హితం కోసం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న జపతులు తమ సంస్థను సంప్రదించవచ్చని కూడా సంస్థ బాధ్యులు వివరించారు. జపతులుగా నమోదు చేసుకోదల్చిన వారు కేసీ దాస్ సంస్థ నెంబర్ 9494877070/7171, సర్వదేవభట్ల అశోక్ 9849050118, బండపెల్లి ఉపేందర్ 8125501004లకు ఫోన్ చేసి వివరాలు అందించాలని సూచించారు.

Gayatri Mantra programkarimnagar newsLatest Newstelangana news