షార్ట్ సర్కూట్ తో వైన్స్ దగ్ధం

దిశ దశ, మంథని:

మంథని పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షాకు కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్దారించారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఆర్ ఆర్ వైన్స్ షాట్ సర్కూట్ తో దగ్ధం అయింది. గురువారం తెల్లవారుజామున షాపు నుండి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న పోలీసులు స్థానిక ఫైర్ స్టేషన్ కు, వైన్స్ యజమానులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో వైన్ షాపులో ఉన్న లిక్కర్ బాటిల్లతో పాటు ఇతరాత్ర వస్తువులు దగ్దమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆస్థి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

crimecrime newsCRIME TODAYManthani RR wine shop fire accident