రాజేందర్ కుటుంబానికి అండగా నిలుస్తా: బండి సంజయ్

దిశ దశ, మహదేవపూర్:

మహదేవపూర్ మండల బీజేపీ కార్యదర్శి మంథని రాజేందర్ హఠాన్మారణం పార్టీకి తీరని లోటని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం రాజేందర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల పార్టీ సభ్యత్వ సేకరణ జరుపుతున్న క్రమంలో గుండె పోటుకు గురై చనిపోయిన రాజేందర్ కుంటుంబాన్ని పరమార్శించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేందర్ జాతీయ భావ జాలంతో బీజేపీలో చేరి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఇటు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశాడన్నారు. రాజేందర్ మరణం వల్ల ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి బీజేపీ పార్టీ బాసటగా నిలుస్తుందన్నారు. చిరు ప్రాయంలో ఉన్న రాజేందర్ పిల్లలను చూసి చలించిపోయిన ఆయన వారికి అవసరమైన విధంగా అండగా ఉంటానన్నారు. కుటుంబ రాజేందర్ కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడిన బండి సంజయ్ వారికి మనోధైర్యాన్ని అందించారు.

bandi sanjay bjpbandi sanjay mpjayashankar bhupalpallymahadevpur