KTRకు పరువు నష్టం దావా నోటీసులు…

దిశ దశ, జాతీయం:

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీ నేత మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం కింద నోటీసులు పంపించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై వారం రోజుల్లో లిఖత పూర్వకంగా క్షమాపణలు కోరాలని లేనట్టయితే 499, 500 ఐపీసీ సెక్షన్లలో కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు మాణిక్కం ఠాగూరు తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్టు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. జనవరి 28న సిరిసిల్లలో తనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కల్గించే విధంగా ఉన్నాయన్నారు. గతంలో కూడా తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు మాణిక్కం ఠాగూర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారిపై కోర్టను ఆశ్రయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న సుధీర్ రెడ్డి, కౌశిక్ రెడ్డిల నుండి స్పందన లేకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో కోర్టుకు హాజరయ్యారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కూడా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మాణిక్యం ఠాగూర్ నోటీసులు పంపడం గమనార్హం.

BRS PARTYCONGRESS PARTYktrLatest Newsmanikkam tagore
Comments (0)
Add Comment