ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అశోక్ యాదవ్

దిశ దశ, మహాదేవపూర్:

మహాదేవపూర్ మండల ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నికలు మంగళవారం జరిగాయి. మండల కేంద్రమైన మహాదేవపూర్ లో నిర్వహించిన ఈ ఎన్నికలు సీనియర్ జర్నలిస్ట్ సట్ల మురళి కృష్ణ , జిల్లా యూనియన్ నాయకులు వేల్పుల వెంకటేష్ పర్యవేక్షణలో జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా జాగరి అశోక్ యాదవ్ (ఆంధ్రజ్యోతి), ఉపాధ్యక్షునిగా తూటిచెర్ల దుర్గయ్య (మన తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ షఫీ (TV5), సంయుక్త కార్యదర్శిగా చీర్లవంచ రమేష్ చారి (నమస్తే తెలంగాణ), కోశాధికారిగా వీరగంటి రాజమౌళి (ప్రజాజ్యోతి)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు సీనియర్ జర్నలిస్టు కాట్రేవుల లచ్చన్న, పరమరాజ్యుల శివ కుమార్, నజీర్, ముబీన్, జమీల్, అడప రమేష్ తో పాటు వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.

BHUPALPALLYLatest NewsMahadevpur Press Club New Committee Electiontelangana news