ఉగ్రవాది ఆరీఫ్ ఉరిశిక్ష ఖరారు: రివ్యూ తిరస్కరించిన సుప్రీం

ఎర్రకోటపై దాడికి పాల్పడిన ఘటనలో ఉగ్రవాది రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనపై విధించిన శిక్షను సమీక్షించాలని లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది పెట్టుకును ధరఖాస్తును రిజక్ట్ చేసింది. 2000 సంవత్సరం డిసెంబర్ లో ఎర్రకోటపై దాడికి పాల్పడినందుకు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌కు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధృవీకరించింది. ఆరిఫ్ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం, దోషి రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది. నేరం రుజువైనందున దోషి పిటిషన్ ను జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఎర్రకోట దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లతో సహా మొత్తం ముగ్గురు మరణించిన సంగతి విధితమే. ఈ దాడిలో నిందితునిగా ఉన్న ఎల్‌ఈటి ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్‌ను విచారించి విధించిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు ధృవీకరించింది. 2011 ఆగస్టులో ఆయన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తిరిగి 2016లో ఆరిఫ్ రివ్యూ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. 2005నవంబర్ నెలలో ట్రయల్ కోర్టు ఆరిఫ్‌కు మరణశిక్ష విధించింది. ఇద్దరు రాజ్‌పుతానా రైఫిల్స్ జవాన్లు, ఒక పౌరుడిని చంపినందుకు ట్రయల్ కోర్టు ఆరిఫ్‌కు రూ.4.35 లక్షల జరిమానా విధించగా 2007లో ఢిల్లీ హైకోర్టు ఆరిఫ్‌ మరణశిక్షను సమర్థించింది.

lashkar e taibaLte Terrorist Review Rejected By Supreme Courtsupeme court of indiaTerrorist