సింహాలు వర్సెస్ గ్రామ సింహాలు…

దిశ దశ, జాతీయం:

అడవుల రారాజులుగా వ్యవహరించే సింహాలతో గ్రామ సింహాలు తలపడ్డాయి. జనారణ్యంలోకి వచ్చి ఓ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేసిన సింహాలు లోపలకు రాకుండా నిలువరించాయి. గుజరాత్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ లోని అమ్రేలి సమీపంలోని ఓ గ్రామంలో ఇంటి గేటు వేసుకుని యజమాని నిద్రలోకి జారుకున్నారు. ఈ నెల 11వ తేది రాత్రి 11.23 గంటల ప్రాంతంలో సమీపంలోని అటవీ ప్రాంతం నుండి అక్కడకు చేరుకున్నాయి. మొదట ఓ సింహం వచ్చి ఇంటి గేటు వద్దకు చేరుకోగానే ఇంటి యజమాని పెంచుకుంటున్న కుక్క అరవడం ప్రారంభించింది. ఈ అలజడి విన్న మరో కుక్క కూడా గేటు వద్దకు వచ్చి సింహాన్ని చూస్తూ అరుస్తున్నాయి. ఇంతలో మరో సింహం కూడా అక్కడకు చేరుకుంది. రెండు సింహాలు కూడా ఐరన్ గేట్ల బయట నుండి గాండ్రించాయి. అయినా వెనక్కి తగ్గని కుక్కలు ఎదురు దాడికి తిగేందుకు సమాయత్తం అయ్యాయి. ఓ దశలో రెండో సింహం ఇంటి గేట్లను ఢీ కొట్టినా కూడా శునకాలు మాత్రం తమ వెనక్కి తగ్గలేదు. చివరకు ఇంటి ముందు నుండి గ్రామ సింహాలు వెల్లిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సీసీ ఫుటేజీ రికార్డును చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.



https://x.com/TeluguScribe/status/1823905956897628343

national newsViral on social mediawild animals