దిశ దశ, ఖమ్మం:
అటవీ భూముల పరిరక్షణ కోసం వెల్లిన రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాస్ రావు హత్య కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు గురువారం తీర్పు నిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ కేసులో నిందితులు మడకం తుల, మిడియం నంగాలకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి వసంత్ పాటిల్ తీర్పునిచ్చారు. అలాగే నిందితులకు రూ. వెయ్యి జరిమానా కూడా విధించారు. 2022 నవంబర్ నెలల పోడు భూములను కాపాడేందుకు భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలం ఎర్రబోడు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ నివాసం ఉంటున్న గొత్తి కోయలు ఎప్ఆర్ఓ శ్రీనివాస్ రావుపై దాడి చేయడంతో చనిపోయారు.