పోలీసుల అదుపులో పౌరహక్కుల సంఘం నేతలు

దిశ దశ, భద్రాచలం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పౌరహక్కుల సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని మణుగురు పట్టణంలోని అభయాంజేనయ స్వామి ఆలయం సమీపంలో వీరిని అడ్డుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర సరిహద్దుల్లోని రఘునాథ్ పల్లి, కరుకుగూడెం అడవుల్లో ఈ నెల 14న జరిగిన ఎన్ కౌంటర్ ఘటనపై నిజ నిర్దారణ చేసేందుకు ఆరుగురు సభ్యుల బృందం బయలుదేరింది. వీరిని శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పోలీసుల అక్రమ నిర్భందంపై పౌర హక్కుల సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Civil Rightsmaoist newstelangana news