విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై….

మరణించిన మహిళా కానిస్టేబుల్

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లా పోలీసు విభాగంలో విషాదం అలుముకుంది. విధి నిర్వహణలో భాగంగా వెల్లిన ఓ మహిళా కానిస్టుబుల్ రోడ్డు ప్రమాదంలో మృత్యుపడ్డారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జిల్లాలోని మల్యాల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వేద శ్రీ (29) సోమవారం డ్యూటీలో భాగంగా బైక్ పై వెల్తున్నారు. అదుపు తప్పడంతో గాయాలపాలు కాగా జగిత్యాల ఆసుపత్రికి తరలించే లోపునే మృత్యువాత పడ్డారు. వేద శ్రీ మరణంతో ఆమె కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లా ఎస్పీ భాస్కర్ జగిత్యాల ఏరియా ఆసుపత్రికి చేరుకుని కానిస్టేబుల్ వేదశ్రీ మృతదేహానికి నివాళులు అర్పించారు.

crimecrime newsCRIME TODAYJAGITHYAL NEWSLatest NewsSP JAGITHYALtelangana news