యువతి పాటకు ఫిదా అయిన కేటీఆర్

దిశ దశ, హైదరబాద్:

ఆధునిక యువతి నోట పాట జాలు వారిన తీరు ఆయన్ను ఆశ్యర్యానికి గురి చేసింది. అందునా హైదరాబాద్ అభివృద్ది విషయంలో్ రాసిన పాట విని మంత్రముగ్దుడయ్యారు. తన రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆశ్చర్యపోయే విధంగా నేటి తరం అమ్మాయి పాట పడేశారు. హైదరాబాద్ లో యువతులతో ముచ్చిటించిన కేటీఆర్ ను ఓ యువతి ఓ పాట రాశాను పాడతానంటూ అనగానే ఇప్పుడా అంటూ ప్రశ్రించారు. అవును సార్ అనగానే సరే పాడండి అని కేటీఆర్ సూచించడంతో ఆ అమ్మాయి పాట పాడి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. హైదరాబాద్ అభివృద్దిపై రచించిన పాటలో తెలంగాణ సంస్కృతి సాంప్రాదాయలకు సంబంధించిన అంశాలను కూడా జోడించారు. స్టెప్పులేస్తూ ఆ యువతి పాడిన పాట విన్న కేటీఆర్ మంత్రముగ్దులయ్యారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.

BRS NEWScm kcrKCRktrKTR was surprised by the young woman's songsLatest Newstelangana news