దోశ కోసం ఆశ పడి… కత్తితో దాడి

దిశ దశ, సంగారెడ్డి:

దోశ కావాలనిఅడిగితే టిఫిన్ సెంటర్ యజామాని లేదన్నందుకు ఏకంగా కత్తితోనే దాడి చేసిన సంఘటన జరిగింది. వినడానికి విచిత్రంగా ఉన్న వాస్తవంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ఓ యువకుడు ఓ టిఫిన్ సెంటర్ కు చేరుకుని దోశ కావాలని అడిగాడు. దోశలు లేవని అయిపోయాయని టిఫిన్ సెంటర్ యజమాని చెప్పడంతో ఆగ్రహించిన సదరు యువకుడు ఏకంగా కత్తితోనే దాడి చేసేందుకు ప్రయత్నించారు. సదరు యువకుడు కత్తితో దాడి చేస్తున్న విషయాన్ని గమనించి టిఫిన్ సెంటర్ ఓనర్ తప్పించుకోవడంతో చేతికి గాయం అయింది. ఇదంతా గమనించిన స్థానికులు ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు దోశ లేకపోతే ఏకంగ హత్య చేయాలా అంటూ కామెంట్ చేస్తుండగా ఈ వీడియోను పోలీసు ఉన్నతాధికారులకు సోషల్ మీడియా వేదికల్లో మెదక్ జిల్లా ఎస్సీకి ట్యాగ్ చేస్తున్నారు.

crimecrime newsCRIME TODAYmedakramayampettelangana crime