ఐదో ‘సారీ’యేనా..? హజరవుతారా..? కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు

దిశ దశ, న్యూ ఢిల్లీ:

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బుధవారం ఈడీ ఐదో సారి సమన్స్ జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నాలుగు సార్లు ఈడీ నోటీసులు ఇవ్వగా ఆయన మాత్రం హజరు కాలేదు. తాజాగా ఐదోసారి ఇచ్చిన నోటీసుల్లో ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని ఈడీ కేజ్రీవాల్ ను కోరింది. అయితే తాజా నోటీసులపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Delhi CM KejriwalDelhi Liquor ScamED notices
Comments (0)
Add Comment