ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుగులోకి వచ్చిన తరువాత ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో జారిపడడంతో తుంటి సంబంధిత సమస్య తలెత్తింది. దీంతో తుండి మార్పిడి చికిత్స చేయడంతో ఆయన ఇంత కాలం రెస్ట్ లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ శాసన సభ నేతగా, ప్రతిపక్షనేతగా బాధ్యతలు తీసుకున్నారు. 

BRS PARTYKCRtelangana newsTS ASSEMBLY
Comments (0)
Add Comment