బాస్ ఈజ్ బ్యాక్…

దిశ దశ, హైదరాబాద్:

ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు షేర్ చేస్తున్నఈ ఫోటోల్లో సీఎం కేసీఆర్ ను డిఫరెంట్ లుక్ లో డిజైన్ చేశారు. కండలు తిరిగిన యోధుడిగా, ఆసుపత్రి నుండి బయటకు రాగానే దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభంజనం వీస్తుందన్న సంకేతాలు ఇచ్చే విధంగా కేసీఆర్ వెనక భారీ ఎత్తున బలగాలను ఉంచి పార్లమెంట్ బ్యాక్ గ్రౌండ్ లో ఇమేజ్ ను క్రియేట్ చేశారు. అనారోగ్యం బారిన పడిన సీఎం కేసీఆర్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు విడుదల చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరో వైపున ప్రత్యర్థి పార్టీల నాయకులు కూడా వీటిపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ ముఖచిత్రంతో తయారు చేసిన ఇమేజెస్ మాత్రం చర్చనీయాంశంగా మారాయి.

BRS NEWScm kcrKCRKCR New Look Images: Viral PhotosLatest Newstelangana news