ఈడీ ఆఫీసుకు కవిత దూత..?

రెండో సారి విచారణకు హాజరు కావల్సిన ఎమ్మెల్సీ కవిత దూతను ఈడీ కార్యాలయానికి పంపించినట్టు తెలుస్తోంది. అయితే ఎలాంటి సమాచారం ఈడీ అధికారులకు పంపించారు అన్నది మాత్రం తెలియడం లేదు. గురువారం ఉదయం నుండి న్యాయ నిపుణులతో చర్చించిన కవిత ఈడీ కార్యాలయానికి ప్రత్యేక వ్యక్తి ద్వారా పంపించిన సమాచారం ఏంటోనన్న ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే ఈడీ అడిగిన సమాచారం కవిత ప్రత్యేక వ్యక్తి ద్వారా ఈడీ ఆఫీసుకు పంపించారని తెలుస్తోంది. మరో వైపు ఈ రోజు విచారణకు హాజరు కాలేనని చెప్పి కవిత సమాచారం పంపించి ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే 10 గంటలకు మీడియా సమావేశం అని చెప్పిన కవిత ఇంతవరకు బయటకు రాకపోగా ప్రత్యేక దూత ద్వారా పంపిన సమాచారంపై చర్చ సాగుతోంది. అధికారికంగా కవిత ప్రకటన విడుదల చేస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశాలు లేవని అర్థం అవుతోంది.

cm kcrED inquiryLatest NewsMLC KAVITHAtelangana news