హై కోర్టుకు హాజరైన ఎంపీ బండి సంజయ్

దిశ ధశ, హైదరాబాద్:

గంగుల కమలాకర్ తప్పుడు అఫిడవిట్, పరిమితికి మించి ఖర్చు పెట్టినట్టుగా వేసిన పిటిషన్ పై హై కోర్టుకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం హాజరయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిటలో స్థిరస్తులను చూపించ లేదని, పరిమితికి మించి గంగుల కమలాకర్ ఖర్చు చేశారని ఆరోపిస్తూ ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో బండి సంజయ్ శుక్రవారం కోర్టుకు హజరై వాంగ్మూలం ఇచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ తరుపు న్యాయ వాది చేసిన క్రాస్ ఎగ్జామినేషన్ కు కూడా బండి సంజయ్ సమాధానాలు ఇచ్చినట్టుగా తెలిసింది.

bandi sanjaygangula kamlakarKarimnagar MP Bandi Sanjay attended the High CourtLatest Newstelangana news