హెలిక్యాప్టర్ లో ఇద్దరు… ఎంపీలుగా ఇద్దరు…

ఉమ్మడి జిల్లా బీజేపీ నేతల తీరు…

దిశ దశ, కరీంనగర్:

ఉమ్మడి కరీంనగర్ బీజేపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ ప్రత్యేకతలను చాటుకుంటున్నారు. పార్టీ అధిష్లానం కూడా జిల్లా నాయకులకే ప్రాధాన్యత కల్పించడంతో రాష్ట్రంలో కరీంనగర్ మరో స్పెషాలిటీని అందుకుంది.

ఈ ఇద్దరు ఇలా…

కమలం పార్టీలో కీలక నాయకులుగా ఎదిగిన బండి సంజయ్, ఈటల రాజేందర్ లు రాష్ట్రం అంతా తిరుగుతూ ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అయిన వీరు తమ సొంత నియోజకవర్గాల్లో తమ గెలుపునకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరో వైపున రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వీరిద్దరు రాష్ట్ర వ్యాప్తంగా తిరేగేందుకు ప్రత్యేకంగా హెలిక్యాప్టర్ లను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం అందుబాటులో ఉంచింది.

ఎంపీలుగా ఆ ఇద్దరు…

మరో వైపున ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు నాయకులను ఒకే జిల్లా ఎమ్మెల్యేలుగా బరిలో నిలిపింది అధిష్టానం. కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ లు లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ కరీంనగర్ నుండి, ధర్మపురి అరవింద్ కోరుట్ల నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఈ రెండు సెగ్మెంట్లు కూడా పూర్వ కరీంనగర్ జిల్లా పరిధిలోనివే కావడం విశేషం.

2023 assembly electionsbandi sanjayKarimnagar district is a specialty of BJP candidatesLatest Newstelangana news