అదెలా…? నేను ఊరుకోను అంతే… కేఏ పాల్ ఆక్రోషం

దిశ దశ, ఏపీ బ్యూరో: 

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ట్రెండింగ్ లో కొనసాగే కేఏ పాల్ మరోసారి తన కామెంట్స్ తో నవ్విస్తున్నారు. తనకు వచ్చిన ఓట్లపై ఆయన తెరపైకి తీసుకొచ్చిన అంశం గమ్మత్తుగా ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో తనకు పడ్డ ఓట్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులందరివి కలిపి 22 ఓట్లు ఉంటే తనకు మాత్రం 4 ఓట్లే పడ్డాయంటూ కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా తనకే ఓటేశారని… లెక్కిస్తే మాత్రం నాలుగు పడ్డట్టుగా చూపిస్తున్నారన్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో వల్లే ఇదంతా జరిగిందని విమర్శిస్తున్న కేఏ పాల్… ఈ దరిద్రపుగొట్టు ఎన్నికలు తనకు అక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు. తనకు వచ్చే 5 లక్షల ఓట్లు ఏమయ్యాయని ప్రశ్నించిన ఆయన 8 చోట్ల సున్నా వచ్చాయంటూ మండిపడ్డారు. 

2024 Electionsap newsap politicsELECTIONS RESULTka paul