యువజనోద్యమ నేత ఇకలేరు…

దిశ దశ, నల్గొండ:

ఉమ్మడి రాష్ట్రంలో యువజన సంఘాల నిర్మాణం, యువకుల్లో నవ చైతన్యం నింపిన నేత, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు విముక్తి కల్పించిన ఆచరణ శీలి, మలి దశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం మరణించారు. భువనగిరి ఫామ్ హౌజ్ లో ఆయన అంత్యక్రియలు జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిట్టా బాలకృష్ణారెడ్డి అందించిన సేవలకు సంబంధించిన సమగ్ర కథనం ఈ కింది లింక్ లో…

యువజనోద్యమ నేతకు తీవ్ర అనారోగ్యం…


BRS PARTYJitta Balakrishna Reddytelangana news