డీజీపీగా జితేందర్… హోం స్పెషల్ సీఎస్ గా రవి గుప్త

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ స్టేట్ పోలీస్ బాసు మారారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున నియమించిన డీజీపీ రవి గుప్తాకు స్థాన చలనం కలిగింది. డీజీపీగా జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తను హోం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియిమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ డీజీపీగా కొత్తగా బాధ్యతలు తీసుకోనున్న జితేందర్ జలంధర్ కు చెందిన వారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన జితేందర్ తెలంగాణాలోని నిర్మల్ అసిస్టెంట్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీసుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బెల్లంపల్లి ఏఎస్పీగా, మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పని చేసిన ఆయన కొంతకాలం సీబీఐలో కూడా విధులు నిర్వర్తించారు. డీఐజీగా పదోన్నతి పొందిన తరువాత విశాఖపట్నం రేంజ్ లో బాధ్యతలు చేపట్టగా, అప్పాలో కూడా పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పని చేసిన ఆయన ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో 14 నెలల్లో రిటైర్ కానున్న జితేందర్ ను డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

telanganaTELANGANA DGPtelangana newstelangana police