ఓడిపోతే నన్ను బ్రతకనివ్వరూ… జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి

జగిత్యాల బీజేపీ అభ్యర్థి…

బోగ శ్రావణి సెన్సెషనల్ కామెంట్స్…

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి ఎన్నికల ప్రచారం చివరి రోజున ఓటర్లను తనదైన స్టైల్లో అభ్యర్థించారు. ఆడబిడ్డనంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తూ తనను అక్కున చేర్చుకోవాలని కోరుతున్నారు. అలాగే తనను గెలిపించకపోతే బ్రతికించరంటూ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. జగిత్యాలలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఓట్ఠు ఓడిబియ్యం రూపంలో అందించి మీ ఆడబిడ్డను సంతోషంగా పంపిస్తారా..? మీ ఆడ బిడ్డను బ్రతికించుకుంటారా..? మీ ఆఢబిడ్డకు బ్రతికే పరిస్థితి ఉండదు… బ్రతకనివ్వరు… ఇక్కడ ఉండనివ్వరు దయచేసి మీ ఇంటి బిడ్డలా ఒడి చాచి అడుతున్నందున తనను గెలిపించాలని కోరారు. ఓట్లను ఓడి బియ్యంగా అడుగుతున్నాను… ఓడి బియ్యం ఇచ్చి మీ ఆడబిడ్డను దీవించి బ్రతికించుకుంటారో చంపుకుంటారా…? మీ ఇష్టం… నిర్ణయం మీ చేతిలో ఉంది ఆశీర్వదించండి… నిర్ణయం మీ చేతిలో ఉంది అంటూ బోగ శ్రావణి ఎన్నికల ప్రచారం చివరి రోజును జగిత్యాల ప్రజలను వేడుకున్నారు. ఈ నెల 30న మీ ఆడబిడ్డ తల రాతను మీరు మార్చాలని, మీ ఆడ బిడ్డ తలరాతను రాసే రోజని గుర్తు పెట్టుకోవాలన్నారు. దయ చేసి ఒక్క అవకాశం అందించాలని… జగిత్యాలను సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ లకు ధీటుగా మంచి స్మార్ట్ సిటీగామంచి నియోజకవర్గంలా అభివృద్ది చేసి మన ప్రాంత ప్రజలు జగిత్యాల అంటే ఇది అని చెప్పుకునే స్థాయికి తీసుకెల్తానని హామీ ఇచ్చారు. మీ ఆడ బిడ్డను దీవించండి… మీ ఇంట్లో తులసి మొక్కలా, మీ కడప ముందు పసుపు బొట్టులాగా, ప్రతి ఒక్కరి తలలో నాలుకాలా ఉంటానంటూ వ్యాఖ్యానించారు. ఒడి పట్టి మీ ముందుకు వచ్చిన ఆడ బిడ్డను సంపుకుంటారా..? సాధుకుంటారా మీ ఇష్టం… అంటూ ఓటర్లను అభ్యర్థించారు.


2023 assembly electionsbjp newsboga sravanihe will not let him live...JAGITIAL NEWSJagityala's BJP candidate Boga Shravani's sensational comments: If he loses