కరీంనగర్ లో అడ్లూరి అరెస్ట్…

జగిత్యాల నుండి వచ్చిన పోలీసు బృందం…

దిశ దశ, కరీంనగర్:

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల జిల్లా పోలీసులు కరీంనగర్ లో ముందస్తు అరెస్ట్ చేశారు. నగర శివార్లలోని విద్యారణ్యపురిలో నివాసం ఉంటున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు. అయితే ధర్మపురిలో మిషన్ భగీరథ స్కీం సక్రమంగా పనిచేయకపోవడంతో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని, వారంలో మూడు నుండి నాలుగు రోజుల పాటు కూడా నీటి సరఫరా కావడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. మంగళవారం ధర్నా చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కరీంనగర్ లో ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుామర్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. జగిత్యాల నుండి ప్రత్యేకంగా ఓ పోలీసు బృందం కరీంనగర్ కు వచ్చి మరీ ఆయన్ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

adloori laxman kumarcm kcrcrimecrime newsJAGITHYAL NEWSkarimnagar newsLatest Newstelangana news