అగ్రిమెంట్ అలా… వాస్తవం ఇలా… ఆనంద్ భవన్ సీజ్… జగిత్యాలలో సంచలనం

దిశ దశ, జగిత్యాల:

మునిసిపాలిటీతో చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాకుండా ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్న కారణంతో అధికారులు ఓ హోటల్ ను సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం వేకువ జామున చేపట్టిన ఈ చర్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అధికారులు చెప్తున్న కథనం ప్రకారం… పట్టణంలోని ఆనంద్ భవన్ ను ఫంక్షన్ హాల్ నిర్వహించేందుకు అగ్రిమెంట్ చేసుకున్న నిర్వహాకులు హోటల్ నడుపుతున్నారన్న కారణంతో సీజ్ చేశారు. ఆదివారం తెల్లవారు జామునే మునిసిపల్ అధికారులు ఆనంద్ భవన్ కు చేరుకుని సీజ్ చేయడం గమనార్హం. అయితే గతంలో కూడా ఇదే అంశంపై ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ చర్యలు తీసుకోకపోగా తాజాగా మాత్రం అధికారులు కఠినంగా వ్యవహరించడం గమనార్హం. ఈ భవనంలో నిర్వహించుకునేందుకు నిర్వహాకులతో ఒప్పందం చేసుకుని ఏడాదికి పైగా అవుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు మాత్రం సీజ్ చేయడం సంచలనంగా మారింది. అయితే తాము గతంలోనే నోటీసులు ఇచ్చామని నిర్వాహకులు తమకు ఇచ్చిన రిప్లైపై తాము సంతృప్తి చెందకపోవడం వల్లే సీజ్ చేశామని పేర్కొన్నారు.

JAGITHYAL NEWSJAGITIAL NEWSLatest Newstelangana newstelugu news
Comments (0)
Add Comment