పరిహారం చెల్లించే వరకూ పనులు ఆపండి: రైతుల డిమాండ్

దిశ దశ, కరీంనగర్:

నేషనల్ హైవే పనులను రైతులు అడ్డుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరించిన తమ భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ ఇరుకుల్లకు చెందిన పలువురు రైతులు వరంగల్, జగిత్యాల నేషనల్ హైవే పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తమకు పరిహారం అందించకుండానే రోడ్డు వేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారులను నిర్మించేందుకు భూ సేకరణ జరిపిన అధికారులు బాధిత రైతాంగానికి పరిహారం మాత్రం ఇవ్వలేదని వాపోయారు. తమ భూములకు సంబందించిన పరిహారం వెంటనే తమకు అందజేయాలని డిమాండ్ చేసిన రైతులు ఆ తరువాతే నిర్మాణం చేపట్టాలని అంటున్నారు. అయితే స్థానికంగా ఉన్న యంత్రాంగం మాత్రం రెండు మూడు రోజుల్లో డబ్బులు అకౌంట్లలో జమ అవుతాయని చెప్పడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. అయితే తమకు పరిహారం సకాలంలో అందించనట్టయితే మాత్రం ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 

flash newsIRUKULLAkarimnagar newsLatest NewsNATONAL HIGHWAY