జగన్ పై కి రాయి విసిరిన అగంతకులు…

దిశ దశ, ఏపీ బ్యూరో: 

ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అగంతకులు రాయి విసరడంతో ఆయన కంటిపై భాగంలో గాయం అయింది. శనివారం రాత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో పర్యటిస్తున్న వైఎస్ జగన్ పైకి పూలతో పాటు రాయిని కూడా అంగతకుడు విసిరినట్టుగా అనుమానిస్తున్నారు. సీఎం జగన్ యాత్ర చేస్తున్న బస్సులోనే ప్రాథమిక అందించారు వైద్యులు. రాయి రువ్వడిగా తాకడంతో కన్ను పైభాగంలో తాకడంతో గాయం అయినట్టుగా భావిస్తున్నారు. బస్సు యాత్రకు హాజరైన జనం వైపునుండి రాయి విసిరిన అంగతుకుల వారిలో కలిసిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. 

2024 Electionsap cm jaganap newsvijayawadays jagan