పోస్టల్ సేవక్ ఫలితాల విడుదల

భారత తపాలా శాఖకు సంబందించిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. జీడీఎస్ 2020కు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ, తెలంగాణ సర్కిళ్లకు సంబందించిన ఫలితాల ఏడో జాబితాను పోస్టల్ విభాగం నవంబర్ 10న విడుదల చేసింది. పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జీడీఎస్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 24 లోగా సర్టిఫికెట్ల పరిశీలన కోసం సంబంధిత పోస్టల్ అధికారుల కార్యాలయాలకు హాజరు కావల్సి ఉంటుంది.

APap newsGDS-2022Indian Postal DepartmentIndian Postal Department GDS-2022 APjob alertjob noitificationjob notificationLatest NewsPostal jobstelangana newsTelangana Result Releasedvacancy jobvecencys