కేసీఆర్ ఇంటి వద్ద 144 సెక్షన్

బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గురువారం ఎమ్మెల్సీ కవితను రెండోసారి ఈడీ విచారించనున్న నేపథ్యంలో తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ ఇంటి వద్ద 144 సెక్షన్ అమలు చేస్తుండడం గమనార్హం. ఈ నెల 11న జరిగిన విచారణ సమయంలో ఈడీ కార్యాలయం వద్ద మాత్రమే 144 సెక్షన్ అమలు కాగా గురువారం జరగనున్న విచారణ నేపథ్యంలో కేసీఆర్ ఇంటి వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇంటి వద్దకు బలగాలు కూడా చేరుకున్నాయి. ఇప్పటికే తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, భారత్ జాగృతి శ్రేణులు న్యూ ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయని భావించి ముందస్తుగా 144 సెక్షన్ అమలు చేసినట్టుగా సమాచారం. అయితే 10 గంటలకు కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడకు పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు కూడా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఇంటికి వెల్లే వారిని పోలీసులు అనుమతి ఇస్తారా లేక మీడియా ప్రతినిధులను మాత్రమే వెల్లేందుకు పర్మిషన్ ఇస్తారా అన్న విషయంపై క్లారిటీ లేదు.

cm kcrDelhi Tughlaq RoadED inquiryLatest NewsMLC KAVITHASection 144 at KCR's house in Delhitelangana news