ఎవరు పోటీ చేస్తారో తెలియదు కానీ…

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వ్యాఖ్యలు

దిశ దశ, జగిత్యాల:

మీ అందరి ఆశీర్వాదం సీఎం కేసీఆర్ పై ఉండాలి… కవితమ్మ ప్రోత్సాహంతో నేనీ పనులు చేయగలుగుతున్నాను… ఎన్నికలయితే ఇప్పుడేం లేవు… ఎవరు పోటీ చేస్తారో తెలియదు కానీ.. అవకాశం వస్తే కానీ నేను రాకున్నా మీరంతా నాకు ఓట్లు వేయాలి అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆదివారం జగిత్యాల మునిసిపాలిటీ పరిధిలో పర్యటించిన ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టికెట్టు రానీ వారి జాబితాలో డాక్టర్ సంజయ్ కుమార్ పేరు ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. నేడో రేపో బీఆర్ఎస్ పార్టీ టికెట్ల కెటాయింపు చేస్తుందన్న నేపథ్యంలో ఆయన ప్రజల మధ్య ఉంటూనే చేసిన వ్యాఖ్యల వెనక మర్మమేమిటి అన్నదే అంతు చిక్కకుండా పోయింది.

cm kcrDR SANJAY MLAJAGITIAL NEWSLatest Newstelangana news