ఇక ప్రిడిక్షన్ చెప్పను: వేణు స్వామి సంచలన ప్రకటన

దిశ దశ, ఏపీ బ్యూరో: 

ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల అధికార మార్పిడి జరగడమే కాదు… జ్యోతిష్య పండితులు కూడా తమ విధానాలను మార్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలన ప్రకటనలకు కేరాఫ్ గా ఉండే వేణు స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి తాను ప్రిడిక్షన్స్ చెప్పనని ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల జ్యోతిష్యాన్ని బట్టి తాను చెప్పానని అయితే తన అంచనాలు తలకిందులు అయిన నేపథ్యంలో ఇక భవిష్యత్తులో వ్యక్తిగతమైన ప్రిడిక్షన్స్ చెప్పనని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఓ వీడియో విడుదల చేసిన వేణు స్వామి తన అంచనాలు తప్పయ్యాయని ఒప్పుకున్నారు. జాతీయ రాజకీయాల్లో మోడీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావించినప్పటికీ బీజేపీ మెజార్టీ గణనీయంగా తగ్గిందన్నారు. ఇక నుండి తాను సినీ, రాజకీయ  వర్గాలకు సంబంధించిన ప్రిడిక్షన్స్ చెప్పనని వేణు స్వామి స్పష్టం చేశారు. 

2024 Electionsap politicslok sabha electionspredictionsvenu swamy