ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వండి సారూ…

దిశ దశ, జగిత్యాల:

పార్టీ పుట్టినప్పటి నుండి జెండా ఎత్తి కొట్లాడినా… మేడిపల్లి మండలంలో నిర్వహించిన ఉద్యమాల్లో పాల్గొన్నా… పోలీసు లాఠీ దెబ్బలు తిన్నా అయినా నాకు పార్టీలో గుర్తింపు లేకుండా పోయింది… చేతకాని వయసుకు వచ్చా ఇప్పుడైన నా గురించి పట్టించుకోండి సారూ అంటూ అవేదన వ్యక్తం చేసిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. జగిత్యాల జిల్లా భీమారం మండలానికి చెందిన రెబ్బస్ మల్లయ్య తనకు సరైన గుర్తింపు ఇవ్వాలంటూ అభ్యర్థిస్తూ ఆడియో పంపించారు. ఇప్పటికైనా తనకు అవకాశం ఇవ్వాలని మల్లయ్య ఆ ఆడియో ద్వారా వేడుకుంటున్నాడు.

cm kcrJAGITIAL NEWSKCRLatest Newstelangana news