ఉపాది కూలీలపై తేనెటీగల దాడి

వందమందిపై అటాక్ చేసిన వైనం

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో వంద మంది అస్వస్థకు గురయ్యారు. స్వల్ప గాయాలైన వారిని స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తుండగా తీవ్ర అస్వస్థకు గురైన వారిని జగిత్యాలకు తరలించారు. వివరాల్లోకి వెల్తే… జిల్లాలోని కొడిమ్యాల మండల కేంద్రంలోని బూరుగుకుంట వద్ద సుమారు 200 మంది ఉపాధి కూలీలు పని చేస్తుండగా ఒక్క సారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో వందమంది వరకు కూలీలు అస్వస్థతకు గురి కాగా స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన 10 మంది కూలీలను జిల్లా కేంద్రమైన జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

bee attackEGS workers injured in bee attackJAGITHYAL NEWSkarimnagar newsLatest Newstelangana news