చందానగర్ లో చెలరేగిన మంటలు

మల్టిపెక్స్ లో అగ్ని ప్రమాదం

దిశ దశ, హైదరాబాద్:

హైదరాబాద్ మహానగరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిలోని మల్టిప్లెక్స్ లో మంటలు చెలరేగడంతో ఐదు స్క్రీన్లలో మూడు స్క్రీన్లు అగ్నికి ఆహూతి అయ్యాయి. శనివారం తెల్లవారు జామున ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం సంభించలేదు కానీ భారీగా అస్థ నష్టం సంభవించినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో కాంప్లెక్స్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అసలేం జరుగుతుందో అర్థం కాకుండా పోయింది. ఈ మాల్ ఇటీవల ప్రారంభం కాగా ఇందులో ఇంకా పూర్తి స్థాయిలో దుకాణాలు కూడా తెరుచుకోనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటన షాట్ సర్క్యూట్ కారణంగా చోటు చేసుకుందా లేక మరేదైనా కారణమా అని తెలియాల్సి ఉంది.

crime newsCRIME TODAYHuge fire accident in Hyderabad Chandanagar MallLatest News