యానంలో ‘హాచికో మూవీ’ సీన్ రిపిట్

దిశ దశ, యానం:

యజమాని శ్వాస వీడినా ఆ శునకం విశ్వాసాన్ని వీడలేదు. హాలివుడ్ సినిమా సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూపించిందో పెంపుడు కుక్క. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి అటు పుదుఛ్ఛేరి ఇటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హృదయవిదారకమైన తెలుగు ‘హాచికొ’ తరహా కథలా ఉందని పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. యానాం – ఎదుర్లంక బ్రిడ్జి మీద చెప్పులు వదిలి గోదావరిలోకి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హాలీవుడ్ సినిమా హాచికొ మూవీలో తన యజమాని కోసం ఆమె చెప్పుల వద్దే తిరుగుతూ అక్కడే ఎదురు చూసిన తీరు ప్రేక్షకులను కట్టి పడేసింది. సేమ్ ఇలాంటి ఘటన యానం వారధి వద్ద సాక్షత్కరించింది. ఈ వంతెనపై ఉన్న చెప్పుల వద్దే కుక్క పడిగాపులు పడుతున్న తీరును గమనించిన యానం పోలీసులు రంగంలోకి దిగారు. శునకం చెప్పుల వద్ద నుండి ఎంతకీ కదలక పోవడంతో అనుమానించిన పోలీసులు గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టి ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు.

CRIME TODAYHollywood movieLatest Newsyanam news