రవితేజతో సినిమా తీయాలంటే హీరోయిన్స్ భయపడుతారు : ఉమైర్ సంధు

ఈ మధ్య ప్రముఖ సినీ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ ఉమైర్ సంధుం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఆయన సమంత, నాగాచైతన్య విడాకులు తీసుకోవాడానికి కారణం చైతూ సమంతకు అబార్షన్ చేయించడమే అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతే కాకుండా, పవన్ కళ్యాణ్ ఉమైనజర్, కృతి శెట్టి పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఈయనకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో తెగ హడావిడి చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఈయన మాస్ మహారాజ రవితేజ మీద మరో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తన కామెడీ, మాస్ యాక్షన్స్ తో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాడు. ఈ మధ్యనే ధమకా సినిమాతో మంచి సూపర్ హిట్ అందుకున్న రవితేజ, తన తదుపరి సినిమాలపై స్పెషల్ ఫొకస్ పెట్టి, చాలా బిజీ అయిపోయాడు. కాగా, అలాంటి మాస్ హీరోపై ఉమైర్ సంధు సంచల వ్యాఖ్యలు చేశాడు.

రవితేజ తో ఎవరైనా హీరోయిన్లు వర్క్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఆయన షూటింగ్ టైంలో హీరోయిన్లను పట్టుకునేటప్పుడు హీరోయిన్లకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు ఆయన పట్టుకునే విధానం హీరోయిన్లకు చాలా ఇబ్బంది ని కలిగిస్తుందంటూ కామెంట్స్ చేశాడు. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది కొత్త హీరోయిన్లను రవితేజ తన అసభ్యకర టచ్ తో ఇబ్బంది పెట్టాడు, అందుకే ఆయనతో సినిమా చేయాలంటే హీరోయిన్స్ భయపడుతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈవార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీని రవితేజ అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదంటూ కొట్టి పారేస్తున్నారు.

Cine Critic Umair SandhuRavi Tejatolly woodTOLLYWOODTollywood Latest NewsTollywood News