చెత్త ఆటో డ్రైవర్ గా బీజేపీ నాయకుడు…

దిశ దశ, జగిత్యాల:

ఉగాది పర్వదినం రోజున వినూత్న నిరసన చెప్పాడు ఓ బీజేపీ నాయకుడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు కలుగున్న అసౌకర్యాన్ని తొలగించాలని భావించాడు. అనారోగ్యం కారణంగా రెండు రోజులుగా చెత్త ఆటో నడిపే డ్రైవర్ విధులకు రావడం లేదు. దీంతో కాలనీల్లో పేరుకపోయిన చెత్త తొలగించేందుకు బీజేపీ నాయకుడు గంగాధర్ ఆటో డ్రైవ్ చేస్తూ చెత్తను తరలించారు. జగిత్యాల పట్టణంలోని 37వ వార్డు కౌన్సిలర్ భర్త గంగాధర్ చెత్త తరలించేందుకు ఆటోను నడిపించారు. ఉగాది పర్వ దినం ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మునిసిపల్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గంగాధర్ డ్రైవర్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. పండుగ పూట కాలనీల్లో పేరుకపోయిన చెత్తతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా చెత్త ఆటో నడింపించాల్సి వచ్చిందని గంగాధర్ చెప్తున్నారు.

bjp newsJAGITIAL NEWSLatest Newstelangana newsTG NEWS
Comments (0)
Add Comment