ఛోటా రాజన్ బర్త్ డే… ముంబాయి వాల అరెస్ట్

మహారాష్ట్రపై మాఫియా పడగ నీడ పడుతూనే ఉంది. అంతర్జాతీయ మాఫియా డాన్ లకు ఒకప్పుడు షెల్టర్ జోన్ గా ఉన్న ముంబాయి మహానగరంలో మరోసారి మాఫియా డాన్ ఛోటా రాజన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరగడం కలకలం సృష్టించింది. ఛోటా రాజన్ కు జన్మదిన వేడుకలను నిర్వహించిన వారిపై మహారాష్ట్ర పోలీసులు కఠినంగా వ్యవహరించారు. చెంబూరు ప్రాంతానికి చెందిన నీలేష్ పరద్కార్ గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించిన ముంబాయి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితున్ని భోయివాడ కోర్టులో హాజరు పర్చగా 25 వేల వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏడు రోజుల పాటు పరాద్కార్ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని, అతని పాస్ పోర్టు కూడా స్టేషన్ లో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.

CHOTA RAJANcrime newsGANGSTARMUMBAI POLICE