కరీంనగర్ లో దొంగల ముఠా..? కొనసాగుతున్న పోలీసుల వేట…

దిశ దశ, కరీంనగర్:: 

కరీంనగర్ లో దొంగల ముఠా ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మంగళవారం తెల్లవారు జామున ఓ వైన్ షాపులో చోరీకి పాల్పడి, మరో మద్యం దుకాణంలోకి చొరబడ్డట్టుగా సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఉనికిని పసిగట్టిన దొంగలు పరార్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ముఠాకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా ముఠా సభ్యుల కోసం వేట కొనసాగిస్తున్నట్టు సమాచారం. నాగపూర్ గ్యాంగ్ గా అనుమానిస్తున్న పోలీసు అధికారులు నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు విశ్వసనీయ సమాచారం. దొంగతనం గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసు అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేరడంతో ఈ ముఠాను ఆదిలోనే కట్టడి చేసినట్టయింది. లేనట్టయితే నగరంలో మరిన్ని చోట్ల దోపిడీలకు పాల్పడే వారు. 

crimeflash newskarimnagar newsLatest Newstelangana news