పోలీసుల అదుపులో నలుగురు..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లో భూ దందాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసుల హంటింగ్ కొనసాగుతూనే ఉంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసు అధికారులు క్రిమినల్ కేసులకు సంబంధించిన ఆధారలు లభ్యం కావడంతో అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వివిధ కేసుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు కూడా ఉండడం గమనార్హం. వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీసు అధికారులు సన్నద్దమైనట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.

crimecrime newskarimnagar newsLatest Newstelangana news