ఒకే కాన్పులో నలుగురు పిల్లలు…

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన

అంత్యంత అరుదైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు ఓ తల్లి జన్మనిచ్చారు. 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి కాన్పులు అవుతాయని డాక్టర్లు చెప్తున్నారు. జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలోని డాక్టర్ శంకర్ ఆసుపత్రిలో ఈ డెలివరి జరిగింది. గొట్టిముక్కులు లావణ్య, కిషన్ దంపతులకు తొలి కాన్పులో కొడుకు జన్మించగా మంగళవారం ఉదయం ఒకే సారి నలుగురు పుట్టడం విషేశం. వీరిలో ముగ్గురు మగ, ఒక ఆడ శిశువు జన్మించినట్టు ఆసుపత్రి డాక్టర్ శంకర్ మీడియాకు వివరించారు. 8 నెలల గర్భంతో ఉన్న లావణ్య సోమవారం ఆసుపత్రికి రావడంతో అనారోగ్య సమస్యను గుర్తించి ప్రీ మెచ్యూర్ డెలివరి చేయాల్సి వచ్చిందని డాక్టర్ అఖిల వివరించారు. ఒక్కో శిశువు కిలోకు పైగా బరువు ఉన్నారని తల్లి బిడ్డ అందరూ క్షేమంగా ఉన్నారన్నారు. శిశువులను సిద్దిపేట ఆసుపత్రికి తరలించి అబ్జర్వేషన్ లో ఉంచినట్టు వివరించారు.

Latest Newsmother who gave birth to four childrenrajanna siricilla districttelangana news