ఆసుపత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. అనారోగ్య సమస్య తలెత్తడంతో ఆయన హైదరాబాద్ లోని యశోధ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. జారిపడడంతో తుంటి బొక్క ఫ్యాక్చర్ కావడంతో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రాథమిక చికత్సం అందిస్తున్న వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆపరేషన్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో కూడా ఆయన ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు. అప్పుడు కూడా చికిత్స అనంతరం కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు.

cm kcrFormer Chief Minister KCR joined the hospitalLatest Newstelangana news