చిక్కిన పులి… జనం ఊపిరి పీల్చుకుని…

దిశ దశ, దండకారణ్యం:

మహారాష్ట్ర, తెలంగాణ సరిహధ్దు ప్రాంత వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు పట్టుబడింది. బార్డర్ ఏరియా గ్రామాల్లో సంచరిస్తున్న ఈ పెద్దపులి కారణంగా భయాందోళనకు గురయ్యారు. 2 నెలలుగా పెద్దపులిని పట్టుకునేందుకు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు వేట కొనసాగించగా ఎట్టకేలకు బుధవారం బోనులో బందించగలిగారు. చంద్రపూర్ జిల్లా ఆత్మారాంగూడ సమీపంలో సంచరిస్తున్న ఈ పులి అడుగు జాడల ఆధారంగా స్పెషల్ టీమ్స్ పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యాయి. గన్ సాయంతో మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో పులిని బోనులో బందించారు. దీనిని చంద్రపూర్ పులుల సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. రక్త నమూనాలు సేకరించిన అటవీ శాఖ అధికారులు శాంపిల్స్ ల్యాబ్ కు పంపించారు. పరీక్షల అనంతరం పులికి సంబంధించిన పూర్తి వివరాలను అటవీ అధికారులు ఎనలైజ్ చేసే అవకాశం ఉంది.

CHANDRAPUR FORESTNATIONALtigerTIGER HUNTINGTiger Reserve