90 ఎంఎల్ కోసం గొంతు కోసేశాడు… కోరుట్ల పట్టణంలో దారుణం

దిశ దశ, కోరుట్ల:

రూ. 200 అయినా ఇవ్వు… లేదంటే 90 ఎంల్ మద్యం అయినా ఇప్పించు అని అడగడంతో నిరాకరించిన వ్యక్తి గొంతు కోసిన ఘటనం కలకలం సృష్టించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. షారూక్ అత్తవారింట్లో గౌస్ అద్దెకు ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం అటుగా వెల్తున్న గౌస్ ను గమనించిన షారూక్ తనకు రూ. 200 కావాలని అడగగా తనవద్ద లేదని చెప్పాడు. 90 ఎంఎల్ మద్యం అయినా ఇప్పించాలని గౌస్ ను అడగగా తన వద్ద డబ్బులు లేదని చెప్పడంతో షారూక్ తన వద్ద ఉన్న బ్లేడ్ తో గౌస్ గొంతు కోశాడు. ఈ విషాయాన్ని గమనించిన స్థానికులు షారూక్ ను పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకుని పారిపోయాడు. గౌస్ ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన షారూక్ స్థానికులను తరుచూ ఇబ్బందులకు గురి చేస్తాడని చెప్తున్నారు. కోరుట్ల పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

crime newsCRIME TODAYJAGITIAL NEWSKOTUTLAtelangana crime news
Comments (0)
Add Comment